
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా ఫిదా అంటూ వచ్చి ఆడియెన్స్ మనసులను ఫిదా చేసేశారు దర్శకుడు శేఖర్ కమ్ముల. దిల్ రాజు బ్యానర్లో వచ్చిన ఈ ఫిదా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సంచలన విజయం అందుకుంది. మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్లిన ఈ సినిమా ఓవర్సీస్ లో ముఖ్యంగా యూఎస్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.
యూఎస్ లో 2 మిలియన్ మార్క్ అందుకున్న సినిమాగా ఫిదా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లో 2 మిలియన్ మార్క్ అందుకున్న సినిమాల్లో ఫిదా 7వ స్థానంలో ఉంది. సాయి పల్లవి నటన, వరుణ్ తేజ్ గ్లామర్, శేఖర్ కమ్ముల డైరక్షన్ ఇలా అన్ని కలిపి సినిమాను సూపర్ హిట్ చేసేశాయి. యూఎస్ లో ఫిదా ఇంకా సక్సెస్ ఫుల్ కలక్షన్స్ తో రన్ అవుతుంది. వరల్డ్ వైడ్ గా ఈసారి మెగా హీరో వరుణ్ తేజ్ తన సత్తా ఏంటో చూపించాడని చెప్పొచ్చు.