
చిన్న సినిమా అయినా సరే మంచి ప్రయత్నంతో వస్తే అక్కున చేర్చుకుంటారు తెలుగు ప్రేక్షకులు. మనసుకి నచ్చే సినిమా అంటే అది చిన్నదా పెద్దదా అని చూడరు ప్రేక్షకులు. తెలుగులో మంచి ఫాంలో ఉన్న చిన్న సినిమాల విజయాల్లో తమ సినిమా కూడా నిలపాలని చూస్తున్నారు ఆనందో బ్రహ్మ టీం. సస్పెన్స్ త్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో తాప్సి లీడ్ రోల్ చేయగా శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిశోర్, షకలక శంకర్, తాగుబోతు రమేష్ లు నటిస్తున్నారు.
సస్పెన్స్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాను మహి.వి.రాఘవ్ డైరెక్ట్ చేయగా 70ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి కలిసి నిర్మిస్తున్నారు. ఆగష్టు 18న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ట్రైలర్ కూడా ఆడియెన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. భయానికి నవ్వంటే భయం అంటూ సినిమా ట్యాగ్ లైన్ కూడా ఆసక్తి కరంగా ఉండటంతో సినిమా మీద మంచి అంచనాలతో ఉన్నారు ప్రేక్షకులు. ఘాజి తర్వాత తాప్సి నటిస్తున్న సినిమాగా మూవీలో ఆమె పాత్ర హైలెట్ గా ఉంటుందని అంటున్నారు.