ఫిదా భామ రూటే సెపరేటు..!

ప్రేమంతో సౌత్ సిని పరిశ్రమను ఓ ఊపు ఊపేసిన సాయి పల్లవి ఫిదాతో మరోసారి తన టాలెంట్ ఏంటో చూపించింది. ఫిదా హిట్ లో మేజర్ రోల్ పోశించిన సాయి పల్లవి రెమ్యునరేషన్ ఇస్తున్నారు కదా అని ఎలా పడితే అలా చేయదని ముందే తెలిసిందే. అంతేకాదు ఫిదా హిట్ తో చాలా ఆఫర్లు వచ్చి పడుతున్నా వాటిలో సెలెక్టెడ్ సినిమాలను ఓకే చేస్తుందట.

ఇక ఫాంలో ఉన్న హీరోయిన్స్ క్రేజ్ క్యాష్ చేసుకునేలా షాప్ ఓపెనింగ్స్ లాంటివి చేస్తుంటారు. అయితే సాయి పల్లవి ఇలాంటి ఆఫర్లకు నో అనేస్తుందట. ఇలాంటి చేయడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని అంటుంది. అంతేకాదు తన అభిరుచి మేరకు సినిమాలు చేస్తున్నా తప్ప డబ్బు సంపాదించాలని కాదని అంటుందట. ఈమధ్యనే ఓ షాప్ ఓపెనింగ్ కు పల్లవిని అడిగితే ఆమె ఇచ్చిన సమాధానం ఇది. ఫ్యాన్సీ ఆఫర్ వచ్చినా సరే ఆ డబ్బు తనకు అక్కర్లేదని అంటుందట ఫిదా భామ. కచ్చితంగా సాయి పల్లవి ఈతరం హీరోయిన్స్ లో ఓ కొత్త సంచలనమే అని చెప్పాలి.