అఖిల్ తో హను.. ఫిక్స్ అయిపోవచ్చు..!

అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాలతో దర్శకుడిగా తన టాలెంట్ చాటుకున్న హను రాఘవపుడి డైరక్షన్ లో లై రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు ముందు అఖిల్ తో ఓ సినిమా కన్ఫాం చేసిన హను ఆ ప్రాజెక్ట్ ఎందుకో వెనుకపడ్డది. ఇక నితిన్ లై సక్సెస్ అయితే కనుక మళ్లీ అఖిల్ తో సినిమా చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నాడట హను రాఘవపుడి. 

అఖిల్ కూడా దానికి ఓకే చెప్పడంతో అఖిల్ కు తగిన కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడట హను. ఇక ఇదే కాకుండా హను నాచురల్ స్టార్ నానితో కూడా మరో సినిమా చేస్తున్నాడట. ప్రస్తుతం ఎం.సి.ఏ మూవీ చేస్తున్న నాని ఆ తర్వాత కృష్ణార్జున యుద్ధం చేస్తున్నాడు. మేర్లపాక గాంధి డైరక్షన్ లో వచ్చే ఆ సినిమా తర్వాత నాని మళ్లీ హనుతో కలిసి సినిమా ఫిక్స్ చేసుకున్నాడట. సో ఈలోపు హను అఖిల్ సినిమా ఫినిష్ చేయాలని చూస్తున్నాడు.