వెబ్ సీరీస్ లో ధనుష్..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మంచి నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా.. రీసెంట్ గా తనకున్న ప్యాషన్ తో తమిళంలో పవర్ పాండి సినిమా తీసి హిట్ అందుకున్నాడు ధనుష్. ఇప్పటికే తెలుగు తమిళ హింది భాషల్లో హీరోగా మంచి మార్కెట్ ఉన్న ధనుష్ ఇప్పుడు దర్శకుడిగా కూడా క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నాడు. ఆ క్రమంలో త్వరలో ఓ వెబ్ సీరీస్ ను స్టార్ట్ చేయబోతున్నాడట.

ధనుష్ డైరక్షన్ లోనే ఈ వెబ్ సీరీస్ ఉండబోతుందట. వెబ్ సీరీస్ చేయాలన్న ఆలోచన రెండేళ్లుగా ఉంటునా సినిమాల బిజీ వల్ల చేయలేకున్నాడట ధనుష్. ప్రస్తుతం విఐపి-2 సినిమా రిలీజ్ కు రెడీ అవగా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి ఈ వెబ్ సీరీస్ పై దృష్టి పెట్టనున్నాడట. ఇక ఈ సీరీస్ లో ధనుష్ నటించే అవకాశాలు మాత్రం లేవట. కేవలం కొత్త టాలెంట్ ను వెతికి పట్టుకునే క్రమంలోనే ఈ వెబ్ సీరీస్ ఉపయోగపడేలా ఉండాలని ధనుష్ చేస్తున్నాడట.