
మెగా హీరో వరుణ్ తేజ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా ఫిదా. శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సాయి పల్లవికి మంచి క్రేజ్ వచ్చింది. ఇక ఈ సినిమా సక్సెస్ లో భాగంగా శేఖర్ కమ్ముల ఓ టాప్ సీక్రెట్ రివీల్ చేశారు. అసలు ఫిదా కథ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నాడట శేఖర్ కమ్ముల.
పవన్ కు వినిపించే అవకాశం లేక మహేష్ తో డిస్కస్ చేయగా తను వద్దనేశాడట. ఇక చరణ్ కూడా ఈ కథ విని వరుణ్ కు సజెస్ట్ చేశాడట. అలా పవర్ స్టార్ చేయాల్సిన సినిమా వరుణ్ తేజ్ కు వచ్చి పడింది. ఖుషి సినిమా రేంజ్ లో సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుందని పవన్ కు కథ వినిపించాలని అనుకున్నాడట శేఖర్ కమ్ముల. అది కుదరలేదు కాబట్టి సినిమాలో హీరోయిన్ భానుమతి పవన్ ఫ్యాన్ గా చూపించాడు. మొత్తానికి పవన్ తో సినిమా తీయలేదు కాని ఫిదాతో మాత్రం శేఖర్ కమ్ముల మరోసారి తన సత్తా చాటుకున్నాడు.