లై రిలీజ్ ముందు హను డబుల్ హ్యాపీ..!

అందాల రాక్షసి, కృష్ణ్గాడి వీర ప్రేమగాథ సినిమాలతో ప్రేక్షకుల్లో దర్శకుడిగా ఓ గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపుడి మరో రెండు రోజుల్లో లై సినిమాతో రాబోతున్నాడు. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించింది. 14 రీల్స్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటించడం విశేషం.

సినిమా రిలీజ్ కు ముందే హను ఇంట సంతోషం వెళ్లువిరుస్తుంది. ఎందుకు అంటే హను తండ్రి కావడమే దీనికి కారణం. హను భార్య అమూల్యూ ఈరోజు బాబుకి జన్మనించ్చింది. రిలీజ్ కు ముందే వారసుడితో హను ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇక సినిమా కూడా అనుకున్న రేంజ్ అందుకుంటే లై తో డబుల్ హ్యాపీస్ అన్నట్టే లెక్క. తనలోని టాలెంట్ తో సినిమా సినిమాకు సర్ ప్రైజ్ చేస్తున్న హను లైతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.