ఆ ముగ్గురిని లైన్ లో పెట్టిన బోయపాటి..!

టాలీవుడ్ క్రేజియెస్ట్ డైరక్టర్ బోయపాటి శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ తో జయ జానకి నాయకా సినిమా చేశాడు. రెండు రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుండగా ఆ తర్వాత సినిమాల మీద పెద్ద ప్లానింగ్ లో ఉన్నాడు బోయపాటి శ్రీను. జానకి సినిమా తర్వాత మెగాస్టార్ తో సినిమాకు స్క్రిప్ట్ సిద్ధం చేసిన బోయపాటి చిరంజీవి ఉయ్యాలవాడ బయోపిక్ తర్వాత తన సినిమా ఉంటుందని చెబుతున్నారు.

ఇక ఆ తర్వాత ఎన్నాళ్ల నుండో మహేష్ తో సినిమా చేయాలని చూస్తున్నానని.. మహేష్ ఇమేజ్ కు తగ్గ ఓ కథను సిద్ధం చేశానని.. చిరు తర్వాత మహేష్ తో ఆ తర్వాత బాలయ్యకు మరోసారి ఓ అద్భుత కథ వచ్చిందని ఈ రెండిటి తర్వాత బాలయ్య సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు బోయపాటి శ్రీను. పక్కా ప్లానింగ్ తో ఎవరితో ఎలాంటి సినిమా అని భారీ స్కెచ్ వేసిన బోయపాటి శ్రీను ఈ సినిమాలన్ని హిట్ టార్గెట్ పెట్టుకున్నాడని చెప్పొచ్చు.