
సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవనుంది. ఇక ఈరోజు మహేష్ పుట్టినరోజు సందర్భంగా స్పైడర్ టీజర్ రిలీజ్ చేశారు. అంచనాలకు తగ్గట్టుగానే స్పైడర్ టీజర్ వచ్చింది. ఇక భయపెట్టడం మాకు తెలుసు డైలాగ్ తో మహేష్ సినిమాలో స్టైలిష్ లుక్ లో కనిపించాడు.
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో హారిస్ జైరాజ్ మ్యూజిక్ ఇంపార్టెన్స్ టీజర్ లోనే చూపించేశాడు. గాఫిక్స్ ప్రాధాన్యత ఉన్నట్టు కనిపిస్తున్న స్పైడర్ టీజర్ లో 1 నిమిషం నిడివిలోనే సినిమా చూపించేశారు. టీజర్ తో సంచలనాలు స్టార్ట్ చేసిన మహేష్ ఈ సంచలనాలను రిలీజ్ తర్వాత కూడా కంటిన్యూ చేసేలా సినిమా ఉండాలని ఆశిస్తున్నారు ఫ్యాన్స్.
తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా 130 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతుంది. తెలుగు తమిళ బైలింగ్వల్ కాగా హిందిలో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.