ఈసారి అనుపమతో నాని..!

వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని ప్రస్తుతం ఓ మై ఫ్రెండ్ సినిమా దర్శకుడు వేణు శ్రీరాం తో ఎం.సి.ఏ సినిమా చేస్తున్నాడు. ఫిదా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో వస్తుంది. డిసెంబర్ కల్లా సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఆ తర్వాత ఎక్స్ ప్రెస్ డైరక్టర్ మేర్లపాక గాంధి తో కృష్ణార్జున యుద్ధం సినిమా కూడా సైన్ చేశాడు నాని.

సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్న నాని అందులో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను ప్రిఫర్ చేశాడట. మేర్లపాక గాంధి కూడా అందుకు ఓకే అనడంతో నానితో అనుపమ రొమాన్స్ షురూ అవబోతుంది. మలయాళ ప్రేమం తో ఎంట్రీ ఇచ్చిన అనుపమ తెలుగులో అఆ, ప్రేమం, శతమానం భవతి సినిమాలతో సూపర్ హిట్ అందుకుంది. మరి నానితో అనుపమ పెయిర్ ఎలా ఉండబోతుందో చూడాలి.