
మహానటి సావిత్రి బయోపిక్ ఆ వస్తున్న మహానటి సినిమా నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వస్తున్న సంగతి తెలిసిందే. వైజయంతి బ్యానర్లో స్వప్న దత్, ప్రియాంకా దత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ మహానటిగా నటిస్తుండగా సమంత, విజయ్ దేవరకొండ కూడా సినిమాలో భాగమవుతున్నారు. ఇక ఈ సినిమాలో చిన్నప్పటి సావిత్రి పాత్రలో మంచు లక్ష్మి తనయ విద్యా నిర్వాణ నటిస్తుందని తెలుస్తుంది.
మహానటి సావిత్రి లాంటి ప్రెస్టిజియస్ సినిమాలో విద్యా నిర్వాణ నటించడం సంతోషంగా ఉందని అంటుంది మంచు లక్ష్మి. ఆ పాత్ర కోసం చాలామందిని చూడగా స్వప్న, ప్రియాంకాలతో ఉన్న స్నేహం కొద్ది తన కూతురికే ఈ అవకాశం దక్కేలా చేసిందట మంచు లక్ష్మి. మరి మహామహులు నటిస్తున్న ఈ మహానటిలో ఈ చిన్ని బుడత ఎలా నటించబోతుందో చూడాలి. మూడేళ్ల వయసున్న విద్యా నిర్వాణ క్యూట్ లుక్స్ తో అందరిని ఎట్రాక్ట్ చేస్తుంది.