కూల్ లుక్ లో లవకుమార్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న సినిమా జై లవకుశ. జై పాత్రతో టీజర్ వదిలి సినిమాపై అంచనాలను పెంచేసిన తారక్ ఈసారి సెకండ్ పాత్ర లవకుమార్ ను రివీల్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చాడు. కూల్ లుక్ లో లవకుమార్ గా తారక్ అదరగొట్టేశాడని చెప్పాలి. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.  

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 21న రిలీజ్ చేస్తున్నారని తెలిసిందే. జై, లవ పాత్రలు ఎలా ఉంటాయో తెలిసింది ఇక తెలియాల్సింది కుశల్ కుమార్ రోల్ ఎలా ఉంటుంది అన్నదే. అది కూడా వచ్చేస్తే లెక్క సరిపోతుంది. జనతా గ్యారేజ్ తర్వాత చాలా కథలు విన్న తారక్ జై లవకుశకు ఓకే చెప్పాడు. కచ్చితంగా ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా సినిమా ఉంటుందని తారక్ గట్టి నమ్మకంతో ఉన్నాడు. మరి ఆ సినిమా సందడి ఎలా ఉండబోతుందో తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.