మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంతే..!

సాధారణంగా ఒక హీరో హీరోయిన్ కలిసి రెండు వరుస సినిమాల్లో నటిస్తే ఇక వారిద్దరి మధ్య చనువు పెరగడం కామనే అది చూసి వారి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ వార్తలు రాసేస్తారు. అయితే కొన్ని న్యూస్ లు ఏకంగా వారి దాకా చేరి డిస్ట్రబ్ చేస్తుంటాయి. ఈ క్రమంలో యువ హీరో వరుస సక్సెస్ లలో ఉన్న నిఖిల్ అతనితో స్వామిరారా, కార్తికేయలలో నటించిన స్వాతిల మధ్య ఉన్న రిలేషన్ గురించి తానే చెప్పాడు.

రానా హోస్ట్ గా జెమిని టివిలో వస్తున్న నెంబర్ 1 యారిలో భాగంగా షోకి అతిధిగా వచ్చిన నిఖిల్ స్వాతితో తన రిలేషన్ గురించి చెప్పాడు. అందరు అనుకుంటున్నట్టు తమ మధ్య ఏమి లేదని మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అన్నాడు నిఖిల్. అంతేకాదు తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని త్వరలో ఓ ఇంటివాడిని అవుతానని అంటున్నాడు నిఖిల్. మరి ఈ రేంజ్ క్లారిటీ ఇచ్చాడు కాబట్టి నిఖిల్ స్వాతిల గురించి వార్తలు రావడం మానేస్తాయేమో చూడాలి.