
నాచురల్ స్టార్ నాని తెలుసు ఈ నాచురల్ స్టార్ లేడీ ఎవరు అని కాస్త ఆశ్చర్యపడొచ్చు. ఇదెవరో అంటున్న మాట కాదు క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ అన్నమాట. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో హరి ప్రసాద్ డైరక్షన్ లో వచ్చిన సినిమా దర్శకుడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈషాను నాచురల్ స్టార్ నానితో పొగిడేశాడు సుకుమార్.
దర్శకుడు సినిమాలో హీరో ఎంత మైనస్ అనిపించాడో హీరోయిన్ అంత ఆకట్టుకుంది. దర్శకుడు సినిమాలో ఈషా నటనకు అందరు హ్యాట్సాఫ్ చెప్పేస్తున్నారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా సరే ఈషా నటనకు మాత్రం అందరు ఫిదా అవుతున్నారు. సినిమా ఫ్లాప్ టాక్ వచ్చినా సరే సుకుమార్ మాత్రం ప్రమోషన్ స్టంట్స్ వదలట్లేదు. హీరోయిన్ ఈషా రెబ్బను పొగుడుతూ సినిమాను కాస్త ప్రేక్షకుల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటున్న ఈషా ప్రతి సినిమాలో తన పాత్ర వరకు న్యాయం చేసేస్తుంది.