
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కు కేంద్ర ఆర్ధిక శాఖ నోటీసులివ్వడం సంచలనంగా మారింది. నాన్నకు ప్రేమతో సినిమాకు గాను ఎన్.టి.ఆర్ అందుకున్న 7.33 కోట్ల రూపాయలకు పన్ను కట్టలేదని వారి నోటీసులో పేర్కొన్నారు. ఇక ఈ న్యూస్ అంతటా సంచలనం కావడంతో వెంటనే తారక్ కూడా విషయంపై స్పందించాడు.
నాన్నకు ప్రేమతో సినిమాకు సంబందించి 7.33 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నది నిజమే కాని దాని పరంగా తానేమి పన్ను కట్టాల్సిన అవసరం లేదని అన్నాడు. సినిమా మొత్తం ఫారిన్ లో షూటింగ్ చేశారు కాబట్టి అక్కడ వచ్చిన అమౌంట్ కు పన్ను కట్టే అవసరం లేదని ఈ విషయంపై తమ ఆడిటర్ సమాధానం ఇచ్చాడని అన్నారు. ఆ సినిమాకు 7.33 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న తారక్ 1.10 కోట్లు పన్ను కట్టాల్సి ఉంది. అయితే ఎక్స్ పోర్ట్ ఆఫ్ సర్వీస్ కింద పన్ను మినహాయింపు పొందినట్టుగా తెలుస్తుంది. ఆదాయపు పన్నుతో పాటు తను సేవా పన్ను కూడా క్రమం తప్పకుండా కడుతున్నానని.. తానేమైనా పెండింగ్ ఉన్నట్టు నిరూపిస్తే కట్టేస్తానని అన్నారు. భాధ్యతాయుతమైన భారత పౌరుడిగా చట్టాలపై తనకు గౌరవం ఉందని అన్నాడు.