ఫస్ట్ లుక్ పోస్టర్.. ఉన్నది ఒక్కటే జిందగీ..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న సినిమా ఉన్నది ఒకటే జిందగి. నేను శైలజతో హిట్ అందుకున్న ఈ కాంబినేషన్ ఆ వెంటనే మరో సినిమా చేయడం మంచి విషయమనే చెప్పాలి. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాతో మరోసారి నేను శైలజ హిట్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు రామ్. 

సినిమాలో హీరోయిన్స్ గా అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. సినిమాకు సంబందించినా ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్ గ్యాంగ్ తో టాప్ లెస్ జీప్ లో ఎంజాయ్ చేస్తున్న రామ్ అండ్ గ్యాంగ్ పోస్టర్ పాజిటివ్ ఫీల్ తెప్పిస్తుంది. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడు అంటూ ఓ సాంగ్ ఈ ఆదివారం ఉదయం రిలీజ్ చేయబోతున్నారట. జగడం, నేను శైలజ తర్వాత దేవి తో రామ్ చేస్తున్న ఈ మూవీ మ్యూజిక్ పరంగా కూడా హిట్ అవుతుందని ఆశిస్తున్నారు.