హిందిలో అనుష్క రేంజ్ అది..!

సౌత్ సూపర్ హీరోయిన్స్ లో ప్రయోగాలను చేస్తూ కమర్షియల్ సక్సెస్ అందుకున్న అనుష్క స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అరుంధతి నుండి బాహుబలి వరకు చరిత్రలో నిలిచిపోయే సినిమాలన్నిటిలో ఆమె నటించింది. ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ కు ఓ కొత్త జోష్ వచ్చేలా చేసిన స్వీటీ అనుష్క ప్రస్తుతం పిల్ల జమిందార్ అశోక్ డైరక్షన్ లో భాగమతి సినిమా చేస్తుంది.

యువి క్రియేషన్స్ పతాకంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా అసలైతే ఆగష్టులో రిలీజ్ అనుకున్నా అది కుదరక అక్టోబర్ కు పోస్ట్ పోన్ చేశారు. సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండటం వల్లే సినిమా వాయిదా వేశారట. ఇక ఈ సినిమా రష్ చూసే ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయట. త్వరలో ట్రైలర్ కూడా రిలీజ్ చేసుకోబోతున్న ఈ సినిమా హింది రైట్స్ రికార్డ్ ప్రైజ్ లో 12.5 కోట్లకు అమ్ముడవడం విశేషం. 

బాహుబలి మొదటి రెండు పార్టులతో అనుష్క హిందిలో కూడా భారీ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. అందుకే ఆమె లీడ్ రోల్ లో నటిస్తున్న భాగమతిని భారీ మొత్తంతో దక్కించుకున్నారు. బాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌజ్ భాగమతి హింది రైట్స్ కొన్నారట. మరి ఆ విషయాలేంటో త్వరలో బయటకు వచ్చే అవకాశాలున్నాయి.