అల్లరోడి ప్రయత్నం ఈసారైనా ఫలించేనా..!

సక్సెస్ కోసం చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్న అల్లరి నరేష్ ప్రస్తుతం మేడ మీద అబ్బాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఒరు వడక్కన్ సెల్ఫీ సినిమా రీమేక్ గా మేడ మీద అబ్బాయి సినిమా వస్తుంది. ఈ సినిమాకు సంబందించిన టీజర్ ఈరోజు రిలీజ్ అయ్యింది ఈ సినిమాలో అల్లరోడికి హిట్ ఇచ్చే ఫీచర్స్ కనిపిస్తున్నాయి. 

ప్రజిత్ డైరక్షన్ లో బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిఖిల హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళంలో నవీన్ పాలి నటించిన ఈ సినిమా అతనికి సూపర్ హిట్ ఇచ్చింది. ఆ నమ్మకంతోనే అల్లరి నరేష్ ఈ సినిమా రీమేక్ చేస్తున్నాడు. టీజర్ పర్వాలేదు అనిపించగా సినిమా నరేష్ ప్రయత్నాన్ని ఫలించేలా చేస్తుందేమో చూడాలి. జాహ్నవి ప్రొడక్షన్ లో వస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.