
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రచయితగా సూపర్ సక్సెస్ లను అందుకున్న వక్కంతం వంశీ డైరక్టర్ గా మొదటి ప్రయత్నం చేస్తున్న సినిమా నా పేరు సూర్య. రీసెంట్ గా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమా ఆగష్టు 15కే ఓ గిఫ్ట్ ఇవ్వనున్నారట. దేశభక్తి కథతో వస్తున్న ఈ సినిమా పై అంచనాలు పెంచేందుకు నా పేరు సూర్య ఫస్ట్ లుక్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేస్తారట.
విశాల్ శేఖర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో ఓ సాంగ్ టీజర్ కూడా ఆరోజు రిలీజ్ చేస్తారని టాక్. అను ఎమాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తున్న నా పేరు సూర్య సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడట. రీసెంట్ గా రిలీజ్ అయిన దువ్వాడ జగన్నాధంతో హిట్ అందుకున్న బన్ని ఆ హిట్ మేనియాను కంటిన్యూ చేసేలా నా పేరు సూర్యకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.