
2018 సంక్రాంతికి పోటీ పడే సినిమాల్లో ఇప్పటికే మహేష్ భరత్ అను నేను, రాం చరణ్ రంగస్థలం ఉండగా ఇప్పుడు సంక్రాంతి బరిలో తాను కూడా వస్తున్న అంటున్నాడు బాలయ్య బాబు. ప్రస్తుతం పూరితో చేసిన పైసా వసూల్ సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతుండగా రీసెంట్ గా మొదలుపెట్టిన కె.ఎస్ రవికుమార్ సినిమా సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారట. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా మాస్ అండ్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతుంది.
నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్స్ నటించే అవకాశం ఉందట. బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్ బాగా కలిసి వస్తుంది. అందుకే ఈ సినిమాను అప్పటికల్లా పూర్తి చేయాలని చూస్తున్నారు. మహేష్, చరణ్ ల సినిమా వచ్చినా రాకున్నా బాలయ్య మాత్రం పొంగల్ వార్ లో పక్కా అని తేలింది. శాతకర్ణి తర్వాత సినిమాల స్పీడ్ పెంచిన బాలకృష్ణ పూరితో మరో సినిమా చేసే అవకాశాలున్నాయట.