
అక్కినేని ఫ్యామిలీ హీరోగా దశాబ్ధ కాలంపైగా హీరోగా అడుగుపెట్టిన సుమంత్ కెరియర్ చెప్పుకోడానికి సత్యం, గోదావరి అన్న రెండు హిట్లు తప్ప ఇక మిగతా వన్ని ఎలాంటి ఫలితాలు సాధించాయో తెలిసిందే. ఈ క్రమంలో విక్రమార్కుడిలా తన ప్రయత్నం మాత్రం చేయడం మానట్లేదు సుమంత్. లాస్ట్ ఇయర్ కొత్త ఉత్సాహంతో బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ విక్కి డోనార్ రీమేక్ గా నరుడా డోనరుడా సినిమా చేసినా లాభం లేకుండా పోయింది.
అందుకే కొద్ది పాటి గ్యాప్ తో సుమంత్ మళ్లీరావా సినిమాతో వస్తున్నాడు. గౌతం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో మూడు జెనరేషన్స్ లవ్ ఉంటుందని తెలుస్తుంది. ఇక సినిమా గురించి ఈరోజు రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద పాజిటివ్ బజ్ ఏర్పరచింది. సుమంత్ ఇలా ఫీల్ గుడ్ మూవీ కూడా తీయగలడా అన్న ఆలోచన ప్రేక్షకుల్లో రావడం విశేషం. టీజర్ అయితే హిట్ అందుకున్నట్టే మరి సినిమా కూడా టీజర్ లానే మనసుని లాగేసేలా ఉంటే ఇక సుమంత్ కెరియర్ లో మళ్లీ ఓ హిట్ పడ్డట్టే. ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను నక్కా రాహుల్ యాదవ్ నిర్మిస్తున్నారు.