రాఖి నాడే జై లవకుశ గిఫ్ట్..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి కాంబోలో వస్తున్న సినిమా జై లవకుశ. టీజర్ తో సంచలనం అంటే ఇదే అన్నట్టుగా నిరూపించిన తారక్ మరోసారి తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. జై పాత్రలో తారక్ అభినయం అదుర్స్ అనిపించేసింది. ఇక ఆ సినిమాలో మరో రెండు పాత్రలు ఎలా ఉంటాయా అన్న ఎక్సయిట్మెంట్ కూడా ప్రేక్షకుల్లో ఉంది. అందుకే ఈసారి మరో రోల్ ను ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు.

జై లవకుశ లోని మరో రోల్ లవకుమార్ రోల్ ఆగష్టు 7న ఉదయం 10 గంటల 30 నిమిషాలకు రివీల్ చేస్తున్నారట. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.  ఇప్పటికే సినిమా టైటిల్ సాంగ్ గా లీక్ అయిన రావణా శక్తి శాసనా సాంగ్ అదరహో అనిపించింది. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందు రాబోతున్న జై లవకుశ ఫ్యాన్స్ కు పండుగ చేసుకునే సినిమా అవుతుందని అంటున్నారు.

రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో నందిత కూడా ఓ స్పెషల్ రోల్ లో కనిపించనుందట. రాఖి రోజు వచ్చే లవకుమార్ ఫ్యాన్స్ ను ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.