రంగస్థలం రాం చరణ్ సంచలనమే..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా క్రియేటివ్ డైరక్టర్ సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా రంగస్థలం 1985. సినిమాలో చరణ్ కొత్త లుక్ తో కనిపిస్తున్నాడు. ఇప్పటికే బయటకు వచ్చిన ఫోటోలతో సినిమాపై అంచనాలను పెంచేయగా ఇక రీసెంట్ గా సైకిల్ మీద చరణ్ లుక్ అబ్బో ఈ సినిమా అనుకున్నట్టుగా ప్రేక్షకులకు రీచ్ అయితే కనుక సంచలనమే అన్నట్టు కనిపిస్తుంది. 


చీకట్లో సైకిల్ మీద అది కూడా స్టైలిష్ గా రాం చరణ్.. ఏం చెబుతున్నాడు అన్నది పక్కన పెడితే ఆ స్టిల్ ఒక్కటి చాలు సినిమా ఎలా ఉంటుంది అని చెప్పడానికి. పల్లెటూరి ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా అసలైతే 2018 సంక్రాంతి రిలీజ్ అని అన్నారు. కాని రిలీజ్ ప్రీ పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చరణ్ రంగస్థలం సంచలనాలకు మనము సాక్ష్యులం కావాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.