ఫిదా పార్ట్-2 క్రేజ్ పెరుగుతుంది..!

ఎలాంటి అంచనాలు లేకుండా సంచలన విజయం అందుకున్న సినిమా ఫిదా. మెగా హీరో వరుణ్ తేజ్, సాయి పల్లవి లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో దిల్ రాజు నిర్మాణంలో వచ్చింది. మొదటి షో నుండి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ సినిమా కలక్షన్స్ లో కూడా మెగా స్టామినా చూపిస్తుంది. 10 రోజుల్లోనే దాదాపు 30 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా యూఎస్ లో అయితే 1.6 మిలియన్ వసూళ్లతో ప్రభంజనం సృష్టిస్తుంది.

ముఖ్యంగా సాయి పల్లవి నటనకు తెలుగు ప్రేక్షకులు అంతా ఫిదా అవుతున్నారు. తెలుగు రాకున్నా సరే భాష యాస నేర్చుకుని మరి సాయి పల్లవి ఈ సినిమా చేసింది. ఇక ఈ సినిమాకు వస్తున్న క్రేజ్ చూసి ఫిదా పార్ట్-2 చేసే ఆలోచన చేస్తున్నారట. శేఖర్ కమ్ముల అయితే ఫిదా పార్ట్-2 స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారని టాక్. దిల్ రాజు మాత్రం ఫిదా సీక్వల్ కన్నా ఇదే స్టార్ట్ కాస్టింగ్ తో మరో సినిమా చేయాలని చూస్తున్నారట.