ఖమ్మంలో పైసా వసూల్ ఆడియో..!

నందమూరి బాలకృష్ణ హీరోగా డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా పైసా వసూల్. భవ్య క్రియేషన్స్ బ్యానర్లో వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా ఆడియో ఆగష్టు 17న ఖమ్మంలో రిలీజ్ చేయనున్నారట. ప్రొడ్యూసర్ ఆనంద్ ప్రసాద్ ఖమ్మం నుండి వచ్చిన వారు కావడం చేత పైసా వసూల్ ఆడియోని అక్కడ ప్లాన్ చేశారు.

ఖమ్మంలో ఎస్.ఆర్ & బి.జి.ఎన్.ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేక్ ఓపెన్ గ్రౌండ్స్ లో ఈ సినిమా ఆడియో రిలీజ్ చేయనున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో శ్రీయా శరణ్ హీరోయిన్ గా నటించింది. శాతకర్ణి సినిమా తర్వాత బాలయ్య అంచనాలకు తలదన్నేలా చేసిన సినిమా పైసా వసూల్. ఖమ్మంలో మొదటిసారి ఓ స్టార్ హీరో ఆడియో ప్లాన్ చేయడం విశేషం.