
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్ లో మొదటి బిగ్గెస్ట్ హిట్ మూవీ ఆర్య. సుకుమార్ మొదటి సినిమా, అల్లు అర్జున్ రెండో సినిమాగా వచ్చిన ఆర్య సూపర్ హిట్ అయ్యింది. అయితే ఆ సినిమా నుండి సుకుమార్ బన్ని కాంబినేషన్ అంటే దానికో లెక్క ఉంటుంది. ఆర్య తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో ఆర్య-2 తీయగా అది కూడా పర్వాలేదు అనిపించుకుంది. ఇక సుకుమార్ మరోసారి బన్నితో ఎప్పుడు సినిమా చేస్తాడని ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.
ఇద్దరు కలిసి కనిపించిన రోజు అడిగేద్దాం అనుకున్న ఫ్యాన్స్ కు దర్శకుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్, బన్ని ఇద్దరు కలిసి ఆ ఈవెంట్ లో కనిపించారు. ఇక దొరికిందే ఛాన్స్ అని ఆర్య-3 ఎప్పుడు అని బన్నిని అడిగేశారు. దానికి సమాధానమిస్తూ ఆర్య, ఆర్య-2 వచ్చాయి అందులో సెకండ్ సినిమా ఆర్యలో తనని సగం మెంటల్ వాన్ని చేశాడు. ఇక ఆర్య-3 చేస్తే పిచ్చోడిని చేసేస్తాడేమో అన్నాడు బన్ని. ఏది ఏమైనా ఆర్య సీరీస్ లా కాకుండా కొత్త కథతో అయినా ఈ కాంబినేషన్ లో సినిమా వస్తే మంచిందని ఆశిస్తున్నారు అభిమానులు. మరి అది ఎప్పుడు జరుగుతుందో చూడాలి.