
బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ నుండి నిష్క్రమించిన సంపూర్ణేష్ బాబు ఎలిమినేషన్ రౌండ్ లోకి రాకుండా మానసిక ఒత్తిడి వల్ల బయటకు వచ్చాడు. అయితే తానలా రావడం జీర్ణించుకోలేని ప్రేక్షకులు తన మీద విపరీతమైన కామెంట్స్ చేశారట. అందుకే నిన్న తారక్ తో కలిసి బిగ్ బాస్ స్టేజ్ మీద కనిపించి మరోసారి వివరణ ఇచ్చుకున్నాడు సంపూ.
కేవలం క్లాస్త్రోఫోబియా వల్ల తను ఆ నాలుగు గోడల మధ్య ఉండలేక హౌజ్ నుండి బయటకు వచ్చానని అన్నాడు బిగ్ బాస్. అయితే తన మీద రకరకాల వార్తలు రావడం బాధించిందని అన్నారు. నిన్న మాట్లాడిన విషయం అంతా స్టార్ మా సమయాభావం వల్ల కట్ చేయడంతో ఈరోజు తన ఫేస్ బుక్ పేజ్, ట్విట్టర్ లో వివరణ ఇచ్చుకున్నాడు సంపూ.
తను పిరికివాడిని కాదని స్పెషల్ స్టేటస్ కోసం 10 గంటలు జైల్లో ఉన్నా తన ధైర్యం సడలలేదు కాని ఈ కామెంట్స్ తనని బాధించాయని అన్నారు. ఇక బాధలో ఉన్నప్పుడు భుజం తట్టిన వాడే నిజమైన హీరో అని.. తన రియల్ హీరో బిగ్ బాస్ అన్ని ఎన్.టి.ఆర్ అన్నే అని అన్నారు సంపూర్ణేష్ బాబు. తనకు ఇలాంటి అవకాశాన్నిచ్చిన స్టార్ మా, బిగ్ బాస్ యాజమాన్యానికి కృతజ్ఞ్తలు తెలిపాడు. ఇక బిగ్ బాస్ హౌజ్ నుండి సడెన్ గా బయటకు వచ్చినందుకు తన మీద పెనాల్టే వేశారన్న వార్తలను కూడా ఖండించాడు సంపూ.