పవన్ త్రివిక్రం అదిరిపోయే రికార్డ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత పవన్ త్రివిక్రం కలిసి చేస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో అదరగొడుతుంది. ఇక శాటిలైట్ రైట్స్ లో కూడా ఇప్పటిదాకా ఏ తెలుగు సినిమా సృష్టించిన రికార్డును ఈ సినిమా సృష్టించింది. సంచలన కాంబినేషన్ గా వస్తున్న ఈ సినిమాను అత్యధికంగా 21కోట్ల శాటిలైట్ రైట్స్ కొన్నారట.

హింది వర్షన్ కు కూడా 11 కోట్లకు కొనేశారని తెలుస్తుంది. జెమిని టివి సొంతం చేసుకున్న ఈ సినిమా శాటిలైట్స్ ద్వారానే 32 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. ఇంతవరకు ఏ తెలుగు సినిమా ఈ రేంజ్ శాటిలైట్ రైట్స్ వసూలు చేయలేదు. కె.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ రికార్డులను అందుకున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.