
కలక్షన్ కింగ్ మోహన్ బాబు లీడ్ రోల్ లో గాయత్రి సినిమా రీసెంట్ గా స్టార్ట్ చేశారు. తన సొంత బ్యానర్ అయిన లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ లో ఈ సినిమా మొదలైంది. పెళ్లైన కొత్తలో దర్శకుడు మదన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటం విశేషం. దర్శక నిర్మతగా కాస్త వెనకపడ్డ మదన్ ఈసారి సరికొత్త కథతో గాయత్రి కథను మోహన్ బాబుకి వివరించారట. కథ బాగా నచ్చడంతో మోహన్ బాబు నిర్మాతగా ఈ సినిమా చేస్తున్నారు.
సినిమాలో మంచు విష్ణు కూడా నటిస్తారని తెలుస్తుంది. అంతేకాదు యాంకర్ అనసూయ కూడా గాయత్రిలో స్పెషల్ రోల్ చేస్తుందట. అయితే సినిమా టైటిల్ గాయత్రి కాబట్టి సినిమా టైటిల్ రోల్ అనసూయదే అయ్యుంటుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా రౌడి, మామ మంచు అల్లుడు కంచు సినిమాల తర్వాత మోహన్ బాబు చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.