
నందమూరి బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి ఘనవిజయం సాధించగా ఆ సినిమా తర్వాత పూరి డైరక్షన్ లో పైసా వసూల్ అంటూ వస్తున్నాడు. రీసెంట్ గా టీజర్ రిలీజ్ తో హంగామా మొదలు పెట్టిన బాలయ్య బాబు సినిమాలో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత 102వ సినిమాగా కె.ఎస్.రవికుమార్ తో సినిమా ఫిక్స్ చేసుకున్న బాలయ్య బాబు ఆ తర్వాత సినిమాలెలా ఉన్నా 105వ సినిమా మాత్రం మల్టీస్టారర్ అని ఫిక్స్ అయ్యాడట.
ఇప్పటికే సీనియర్ స్టార్ హీరోలు వెంకటేష్, నాగార్జున మల్టీస్టారర్స్ చేస్తుండగా ఆ దారిలో బాలకృష్ణ కూడా మల్టీస్టారర్ చేసేందుకు సిద్ధమయ్యాడట. మరి బాలయ్య మల్టీస్టారర్ మూవీ ఎవరితో ఉంటుంది.. ఇప్పటికే తన దగ్గరకు మల్టీస్టారర్ కథ వచ్చిందా.. అందుకే బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న చర్చలు మొదలయ్యాయి. మరి బాలయ్య చేసే మల్టీస్టారర్ ఎలా ఉంటుందో చూడాలంటే ఎన్.బి.కె 105వ సినిమా దాకా వెయిట్ చేయాల్సిందే.