
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ డైరక్షన్ లో నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న సినిమా పైసా వసూల్. సినిమాకు సంబందించిన పోస్టర్ అంచనాలు పెంచేయగా ఈరోజు సినిమా నుండి స్టంపర్ 101 అని రిలీజ్ చేశారు. టీజర్ కు ఎక్కువ.. ట్రైలర్ కు తక్కువగా వచ్చిన ఈ పైసా వసూల్ స్టంపర్ నందమూరి ఫ్యాన్స్ ను అలరిస్తుంది.
పూరి మార్క్ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న ఈ టీజర్ లో బాలయ్య లుక్కు.. డైలాగ్ డెలివరీ రెండూ అదగొట్టాయని చెప్పొచ్చు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో శ్రీయ శరణ్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలయ్య డాన్ గా నటిస్తున్న ఈ సినిమా స్టంపర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. సెప్టెంబర్ 29న రిలీజ్ అనుకున్న ఈ సినిమా ప్రీ పోన్ చేసే అవకాశాలున్నాయట. ఇక ఈ సినిమా ఆడియో ఆగష్టు 16న ఖమ్మంలో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.