
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వచ్చిన సినిమా ఫిదా. మలయాళ భామ సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. మొదటి షో నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా చూసిన రాజకీయ ప్రముఖులు కూడా తమ స్పందన తెలియచేశారు.
ఇక ఈ సినిమా చూసి తెలంగాణ ఐ.టి పంచాయితి రాజ్ శాఖా మంత్రి కె.తారక రామారావు తన స్పందన తెలియచేశారు. స్వచ్చమైన తెలంగాణా నేపథ్యంలో సాగిన ఈ ప్రేమకథ హృదయాన్ని కదిలించేలా ఉందని.. తనని కూడా ఫిదా చేసిందని ట్వీట్ చేశారు కె.టి.ఆర్. ఇక ఈ సినిమా దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ సాయి పల్లవిలకు ఈ ట్వీట్ ట్యాగ్ చేశారు. రీసెంట్ గా తెలంగాణా ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ఫిదా చూసి తన స్పందన తెలియచేయగా ఆ క్రమంలో కె.టి.ఆర్ కూడా ట్వీట్ తో తన విశెష్ ను అందచేశారు.