వంశీ సినిమా మహేష్ ఎదురుచూపులు..!

ప్రస్తుతం స్పైడర్ సినిమా ముగింపు దశలో ఉండగా ఆ తర్వాత కొరటాల శివతో భరత్ అను నేను కూడా లైన్ లో పెట్టాడు మహేష్. ఇక ఇవే కాకుండా ఎన్నాళ్ల నుండో క్రేజీ ప్రాజెక్ట్ గా అనుకుంటున్న వంశీ పైడిపల్లితో కూడా మహేష్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. దిల్ రాజు, అశ్వనిదత్ కలయికలో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది స్టార్ట్ అవనుంది.

ఇక ఈ సినిమా దర్శకుడు ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు పూర్తి చేయగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వంశీకి బర్త్ డే విశెష్ అందిస్తూ తనతో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా అంటూ ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే మహేష్ 25వ సినిమాగా రాబోతుండటమే. అంచనాలు అందుకునేలా ఈ సినిమా కథ ఉంటుందని టాక్. మరి మహేష్ తో మొదటిసారి అవకాశాన్ని అందుకున్న వంశీ పైడిపల్లి ఎలాంటి సినిమా అందిస్తాడో చూడాలి.