జై టైటిల్ సాంగ్ లీక్.. దేవి ఇరగ్గొట్టాడే..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న జై లవకుశ టీజర్ తో సినిమా మీద అంచనాలను పెంచేయగా ఇప్పుడు ఈ సినిమా నుండి లీక్ అయిన టైటిల్ సాంగ్ మరింత బీభత్సం సృష్టిస్తుంది. 'రావణా శక్తి శాసనా' అంటూ సాగే ఈ సాంగ్ జై లవకుశలోని జై పాత్రని వర్ణిస్తూ వచ్చే సాంగ్ లా అనిపిస్తుంది. దేవి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని ఈ సాంగ్ వింటేనే ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 

బాబి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్నారు. రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా దసరా బరిలో సెప్టెంబర్ 21న రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఆగష్టు 12న ఆడియో రిలీజ్ చేయాలని చూస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ముగింపు దశలో ఉంది.