
అక్కినేని అఖిల్ విక్రం కుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాను డిసెంబర్ 22న రిలీజ్ చేస్తారని ఫిల్మ్ నగర్ టాక్. అయితే షూటింగ్ జరుపుకుంటున్నా సరే ఇప్పటివరకు సినిమాలో హీరోయిన్ ఎవరన్నది బయటకు చెప్పలేదు.
అంతేకాదు ఇప్పటివరకు కేవలం 50 శాతం మాత్రమే షూటింగ్ కంప్లీట్ చేసుకుందట. మరి సినిమా పూర్తి కాకముందే డిసెంబర్ లో రిలీజ్ అని నిర్ణయించి నాగ్ వేసిన స్కెచ్ ఏంటని అర్ధం కావట్లేదు. మొదటి సినిమా ఫ్లాప్ బాధ నుండి బయట పడటానికి రెండేళ్లు టైం తీసుకున్న అఖిల్ ఈసారి పక్కా హిట్ అనే విధంగా కష్టపడుతున్నాడట. సినిమాలో అఖిల్ డ్యాన్స్, ఫైట్స్ కచ్చితంగా ఫ్యాన్స్ ను హుశారెత్తేలా చేస్తాయని అంటున్నారు.