
పెళ్లిచూపులు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత వచ్చిన ద్వారక మూవీ ప్రేక్షకులను నిరాశ పరచింది. అందుకే ప్రస్తుతం తీస్తున్న అర్జున్ రెడ్డి విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాడు విజయ్. పెళ్లి చూపులతో ఒక్కసారి సూపర్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ హీరో ఆ దెబ్బతో పదుల సంఖ్యలో సినిమాలు వచ్చాయి.
ఇక రాబోతున్న అర్జున్ రెడ్డి విషయంలో కాస్త డౌట్ గా ఉన్న చోట మళ్లీ రీషూట్స్ చేశారని తెలుస్తుంది. మరి విజయ్ తీసుకున్న ఈ ముందు జాగ్రత్తలు సినిమాకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో చూడాలి. ద్వారకా ప్రేక్షకులు మెప్పు పొందినా కమర్షియల్ గా హిట్ అందుకోలేదు. మరి అర్జున్ రెడ్డిగా రాబోతున్న విజయ్ పాజిటివ్ ఫలితాన్నే అందుకుంటాడేమో చూడాలి. ఈ సినిమా టీజర్ అయితే అందరి మెప్పు పొందింది.