
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న సినిమా జై లవకుశ. టీజర్ తో రావణ రాక్షసత్వం చూపి అంచనాలను పెంచేసిన ఎన్.టి.ఆర్ సినిమాలో మరో రెండు పాత్రలతో కూడా ఆకట్టుకుంటాడని తెలుస్తుంది. సెప్టెంబర్ 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియోని ఆగష్టు 12న రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, నివేథా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆడియో కూడా అంచనాలకు మించి ఉంటుందని తెలుస్తుంది. తారక్, దేవి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ వచ్చాయి. ఈ క్రమంలో జై లవకుశ కూడా అదిరిపోయే ఆల్బంతో వస్తున్నారట. దసరా బరిలో దుమ్ము దులిపేందుకు సిద్ధమవుతున్న తారక్ ఈసారి ఏమాత్రం టార్గెట్ మిస్ అవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.