అనసూయ కోసం చరణ్ వెయిటింగ్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం 1985. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ ఓ స్పెషల్ రోల్ ప్లే చేస్తుందని తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆమె రోల్ ఇప్పటికే కొంత పార్ట్ షూట్ అవగా ఇక మిగతా షూటింగ్ కోసం అనసూయ తన డేట్స్ అడ్జెస్ట్ చేయట్లేదని అంటున్నారు.

ఈ సందర్భంలో అనసూయ కోసం చరణ్ కూడా వెయిట్ చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. పల్లెటూరి ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమాలో చరణ్ లుక్ మెగా ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా ఉంటుందని సుకుమార్ చెబుతూ సినిమాపై అంచనాలను పెంచేశాడు. ధ్రువ హిట్ తో మళ్లీ ఫాంలోకి వచ్చిన చరణ్ రంగస్థలంతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.