బోయపాటి టీజర్ అదుర్స్..!

బోయపాటి శ్రీను డైరక్షన్ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న సినిమా జయ జానకి నాయకా. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆగష్టు 11న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. టైటిల్, మొదటి టీజర్ బోయపాటి ఇలాంటి సినిమా తీశాడేంటి అని డౌట్ వచ్చేలా చేయగా రీసెంట్ గా వచ్చిన టీజర్ మాత్రం బోయపాటి స్టామినా చూపించాడు.

తనకు నచ్చిన మాస్ అంశాలతో టీజర్ వదిలిన బోయపాటి హీరో కుర్రాడు అన్న ఆలోచన రాకుండా టీజర్ తో దుమ్ముదులిపాడు. బోయపాటి శ్రీను డైరక్షన్ టాలెంట్ అందరికి తెలిసిందే. లాస్ట్ ఇయర్ సరైనోడుతో సూపర్ హిట్ అందుకున్న బోయపాటి శ్రీను ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ కొట్టేలా ఉన్నాడు. భద్ర సినిమా తరహాలో ఉండబోతున్న ఈ సినిమాతో బెల్లంకొండ బాబుకి హిట్ దక్కుతుందేమో చూడాలి.