
శేఖర్ కమ్ముల డైరక్షన్ లో మెగా హీరో వరుణ్ తేజ్ సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ఫిదా. సినిమా పబ్లిక్ టాక్ లో సాయి పల్లవి అభినయం గురించే అందరు మాట్లాడుతున్నారంటే అమ్మడు ఏ రేంజ్ లో ఎట్రాక్ట్ చేసిందో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణా యాసలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్న సాయి పల్లవి సినిమాకు తను ఎంత కష్టపడుతుందో అర్ధమవుతుంది.
అంతేకాదు ఫిదా మూవీలో సాయి పల్లవి పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఖుషి అయ్యేలా చేసింది. భానుమతి పాత్రలో నటించిన సాయి పల్లవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా అదరగొట్టింది. పవన్ క్రేజ్ ను సినిమాలో పెట్టి క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారు దర్శక నిర్మాతలు. నిన్న రిలీజ్ అయిన ఫిదా మూవీ అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. వరుణ్ తేజ్ కెరియర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని అంటున్నారు.