
మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్న సినిమా రంగస్థలం. సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో చరణ్ లుక్ అందరిని షాక్ అయ్యేలా చేస్తున్నాయి. పల్లెటూరి కుర్రాడిలా కనిపించబోతున్న చరణ్ మెగా అభిమానులకే కాదు సిని ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తాడని అంటున్నారు. అయితే ఈమధ్యనే సినిమాలో చరణ్ లుక్ ఒకటి లీక్ అయ్యింది.
ఆ పిక్ లో చరణ్ లుక్ అదిరిపోయింది. సుక్కు మార్క్ స్టైలిష్ లుక్ లో చరణ్ అదరగొడుతున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనసూయ స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తుంది. మరి చరణ్ లుక్స్ అయితే సినిమా మీద అంచనాలు పెంచేశాయి.. ఈ లుక్స్ తో చరణ్ రంగస్థలం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.