
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇన్నాళ్లు కెరియర్ లో గ్లామర్ రోల్స్ మాత్రమే చేస్తూ వచ్చింది. రొటీన్ సినిమాలు చేసి బోర్ కొట్టిందో లేక కొత్తగా ఏదైనా చేయాలన్న ఆలోచన వచ్చిందో కాని రకుల్ ప్రీత్ సింగ్ కొత్తగా ఒప్పుకున్న ఓ సినిమా గురించి షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. సినిమాలో డీ గ్లామరస్ గా కనిపించబోతున్న రకుల్ ఏకంగా విడోగా కనిపిస్తుందని టాక్.
ఓ సీనియర్ డైరక్టర్ చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ సినిమా చేసే ఆలోచనలో ఉందట రకుల్. చేస్తున్న సినిమాలు మంచి పేరు తెచ్చి పెడుతున్నా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు రావాలని ఆరాటపడుతుంది అమ్మడు అందుకే ఈ ప్రయోగం చేయబోతుందట. అనుష్కలా స్పెషల్ క్రేజ్ సంపాదించాలనుకుందో ఏమో కాని విడోగా రకుల్ అంటే మాత్రం ఆమె అభిమానులు డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.