
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బాబి కాంబినేషన్ లో వస్తున్న జై లవకుశ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో అదరగొడుతుంది. జనతా గ్యారేజ్ ఫుల్ రన్ లో 85 కోట్లు వసూలు చేస్తే జై లవకుశ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్టింగ్ రేటే అంత చెబుతున్నారట. టీజర్ తో అంచనాలను పెంచేసిన ఈ సినిమా ఆంధ్రాలో రికార్డ్ ప్రైజ్ కు అమ్ముడయ్యిందని టాక్.
ఏకంగా 36 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్నారట. ఇక తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా 70 కోట్ల దాకా బిజినెస్ చేసిందని టాక్. ఇక ఓవర్సీస్ మిగతా భాషల రైట్స్ ఉండనే ఉన్నాయి. సో ఏ లెక్కన చూసినా సరే జై లవకుశ తారక్ స్టామినా ప్రూవ్ చేస్తుందని చెప్పొచ్చు. అంచనాలు చూస్తుంటే సినిమా బిజినెస్ 120 కోట్ల దాకా జరుగుతుందని టాక్. మరి దసరా బరిలో దిగుతున్న తారక్ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడో చూడాలి.