పదిరోజుల్లో పాతిక కోట్లు.. ఇది నాని సత్తా..!

నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వచ్చిన సినిమా నిన్ను కోరి. ఈ ఇయర్ ఇప్పటికే నేను లోకల్ తో హిట్ అందుకున్న నాని ఈ సినిమా హిట్ తో వరుసగా 7 హిట్లు అందుకున్నాడు. నిన్ను కోరి సినిమా రిలీజ్ అయిన రెండు వారాల్లో పాతిక కోట్లను కలెక్ట్ చేసి మరోసారి నాని స్టామినా ప్రూవ్ చేసింది. మొదటి వారాంతరంలోనే ఓ రేంజ్ వసూళ్లను రాబట్టిన నిన్ను కోరి రెండో వారంలో అదే జోరు కొనసాగించింది.

ఇప్పటికే 45 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూళు చేయగా 25 కోట్ల షేర్ వచ్చిందని తెలుస్తుంది. ఇక టోటల్ రన్ లో 30 నుండి 35 కోట్ల దాకా వసూళు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. యావరేజ్ హీరో నుండి పది రోజుల్లో పాతిక కోట్లు కొల్లగొట్టిన హీరోగా నాని పెంచుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో నివేథా థామస్ హీరోయిన్ గా నటించగా ఆది పినిశెట్టి స్పెషల్ రోల్ లో నటించాడు.