అక్కినేని హీరో 'మళ్లీ రావా'..!

అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన హీరో సుమంత్ కెరియర్ లో సత్యం, గోదావరి సినిమాలు తప్ప హిట్ అందుకోలేదు. అయినా సరే పట్టు వదలని విక్రమార్కునిలా సినిమాలు చేస్తూనే ఉన్నాడు సుమంత్. లాస్ట్ ఇయర్ నరుడా డోనరుడా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుమంత్ ఆ సినిమా తర్వాత కొద్దిపాటి గ్యాప్ లో మళ్లీ మరో సినిమాతో వస్తున్నాడు.  


గౌతం అనే కొత్త దర్శకుడితో మళ్లీ రావా సినిమా చేస్తున్నాడు సుమంత్. సినిమాలో త్రీ జెనరేషన్స్ లో స్టోరీ నడుస్తుందట. హీరో కూడా 15, 25, 35 ఇలా వయసుల మాదిరిగా తన ఆలోచనలు ఎలా ఉంటాయన్నది సినిమా కథట. పక్కా ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా తనకు మంచి హిట్ ఇస్తుందని ఆశిస్తున్నాడు సుమంత్. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.