
బిగ్ బాస్ హౌజ్ లో స్ట్రక్ అయిన హరితేజ విషయంలో మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ చాలా సీరియస్ గా ఉన్నాడని ఫిల్మ్ నగర్ టాక్. అఆలో అదరగొట్టిన హరితేజను పవర్ స్టార్ సినిమాలో కూడా తీసుకున్నాడు త్రివిక్రం. ఇప్పటికే హరితేజతో ఉన్న సీన్స్ షూట్ చేయగా ఇంకా కొన్ని సీన్స్ షూటింగ్ చేయాల్సి ఉందట. అయితే బిగ్ బాస్ షోతో ఆ హౌజ్ లో 70 రోజులు అందులో ఉండాలి.
సినిమాను సెప్టెంబర్ కల్లా పూర్తి చేయాలని అనుకున్న త్రివిక్రం శ్రీనివాస్ కు హరితేజ గట్టి షాకే ఇచ్చింది. బిగ్ బాస్ లో ఇన్ని రోజులు కేటాయించాలని త్రివిక్రం తో చెప్పకుండా హరితేజ డెశిషన్ తీసుకుందట. ఈ ప్రోగ్రాంపై త్రివిక్రం అసంతృప్తిగా ఉన్నాడని టాక్. కే.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలైతే తారాస్థాయిలో ఉన్నాయి.