
డ్రగ్స్ కేసులో పోలీసులు నోటీసులు అందుకున్న జాబితాలో ముమైత్ ఖాన్ ఉన్నట్టు తెలిసిందే. డ్రగ్స్ తో తనకెలాంటి సంబంధం లేదని రాక రాక హైదరాబాద్ వస్తే భలే వెల్కం చెప్పారని అన్నది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటి అంటే ప్రస్తుతం ముమైత్ ఖాన్ స్టార్ మా లో ఎన్.టి.ఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ హౌజ్ లో ఉంది. 70 రోజుల పాటు ఈ హౌజ్ లో ఉండాలి.
అయితే డ్రగ్స్ కేసులో ముమైత్ ఖాన్ ఈ నెలాఖరు కల్లా పోలీసుల విచారణలో పాల్గొనాల్సి ఉంది. ఈ టైంలో బిగ్ బాస్ లో ఉన్న ఆమె పెద్ద చిక్కుల్లో పడ్డదని తెలుస్తుంది. హైదరాబాద్ ఇదవరకు తను ఉన్న ఇంటికి నోటీస్ పంపితే అక్కడ నుండి రిటర్న్ రాగా ఇప్పుడు అమ్మడు పూణెలో ఉన్న బిగ్ బాస్ హౌజ్ కే పోలీసులు వెళ్తారేమో అంటున్నారు. విచారణకు సహకరించిన వారిని అరెస్ట్ చేసే ఆలోచనలో ఉన్న పోలీసువారు అన్నట్టుగానే చేస్తారా లేదా అన్నది చూడాలి.