బాహుబలి రేంజ్ లో స్పైడర్..!

బాహుబలి తర్వాత అదే రేంజ్ లో సినిమా తీయాలని అందరు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రిలీజ్ కాబోతున్న మహేష్ స్పైడర్ బాహుబలి మేనియా కొనసాగించాలని చూస్తుంది. అదెలా అంటే బాహుబలి లానే తెలుగుతో పాటుగా తమిళ హింది భాషల్లో కూడా స్పైడర్ రిలీజ్ చేస్తున్నారట. అంతేకాదు బాహుబలి హిందిలో కరణ్ తో పాటుగా మేజర్ డిస్ట్రిబ్యూషన్ చేసిన ఏ.ఏ ఎంటర్టైన్మెంట్స్ తో హిందిలో స్పైడర్ రిలీజ్ చేయాలని చూస్తున్నారట.

మురుగదాస్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాపై దాదాపు 130 కోట్ల బడ్జెట్ పెట్టేశారని తెలుస్తుంది. టీజర్ తో అంచనాలను పెంచిన స్పైడర్ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందని అంటున్నారు. దసరా బరిలో తెలుగు తమిళ హింది భాషల్లో రిలీజ్ అవనున్న స్పైడర్ ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.