ప్రేమం భామ ఆ నిర్మాతతో భారీ డీల్..!

మలయాళ ప్రేమంతో సూపర్ హిట్ అందుకున్న సాయి పల్లవి కేవలం ఆ ఒక్క సినిమాతో సౌత్ లో సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ప్రస్తుతం తెలుగులో ఫిదా మూవీలో నటించిన సాయి పల్లవి ఆ సినిమా నిర్మాతతో భారీ డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. ఇండస్ట్రీకి ఏ హీరోయిన్ వచ్చినా వారిపై ఓ కన్నేసే దిల్ రాజు సాయి పల్లవిని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు.

ఆమె యాక్టింగ్ స్కిల్ చూసి కచ్చితంగా ఆమె ఇక్కడ కూడా సూపర్ సక్సెస్ అవుతుందని భావించి తను చేయబోయే వరుస సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నాడట. ప్రస్తుతం నానితో నిర్మిస్తున్న ఎం.సి.ఏ సినిమాలో కూడా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా మెగా హీరో సాయి ధరం తేజ్ తో చేయబోయే శ్రీనివాస కళ్యాణం సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్ గా ఫిక్స్ చేశారట. తెలుగులో ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే సాయి పల్లవి క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాడు దిల్ రాజు.