
మెగా హీరోల్లో రాం చరణ్ మరోసారి తన తెలివితేటలను ప్రదర్శించి మెగా అభిమానుల మెప్పు పొందాడు. రీసెంట్ గా దర్శకుడు ఆడియో రిలీజ్ కార్యక్రమంలో అతిధిగా వచ్చిన చరణ్ సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడి సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని అవ్వాలని కోరుకున్నారు. ఇక తను మాట్లాడేటప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా అంతా ఇంతా కాదు. పవర్ స్టార్ కేకలకు స్పందించిన చరణ్ ఫ్యామిలీ గురించి ప్రేమ మనసులో చెప్పలేనంత ఉంది. మాటల్లో తక్కువ వస్తుంది అంటూ ఫ్యాన్స్ ను ఖుషి చేశాడు.
చెప్పను బ్రదర్.. సారీ బ్రదర్ లాంటి ఎపిసోడ్స్ కు తావున్నా సరే చరణ్ అలాంటివేమి చేయకుండా సైలెంట్ గా బాబాయ్ నా మనసులో ఉంటారంటూ మరింత జోష్ పెంచాడు. కచ్చితంగా మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా చరణ్ స్పీచ్ కు ఫిదా అయ్యారంతే. సుకుమార్ డైరక్షన్ లో రంగస్థలం సినిమా చేస్తున్న చరణ్ సంక్రాంతి నాడు తన సినిమాతో రానున్నాడు.